మయామి ఎయిర్‌పోర్టులో విమాన ప్రమాదం.. 5కి చేరిన మృతుల సంఖ్య (వీడియో)

అమెరికాలోని మయామి అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం అమెజాన్‌కు చెందిన కార్గో విమానం రన్‌వే దాటి ప్రమాదానికి గురై మంటల్లో చిక్కుకుంది. ఈ ఘటనలో ఇప్పటివరకు ఐదుగురు మృతి చెందారు. ప్రమాదం జరిగిన వెంటనే ఓ పైలట్‌ కాక్‌పిట్‌ నుంచి దూకి ప్రాణాలు కాపాడుకున్న దృశ్యాలు వైరల్‌గా మారాయి. మంటలు వేగంగా వ్యాపిస్తుండగా అతడు విమానం నుంచి బయటకు వచ్చి అక్కడి నుంచి పరుగెత్తినట్లు వీడియోలో కనిపిస్తోంది. ప్రమాదానికి గల కారణాలపై అమెరికా అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕