మహారాష్ట్ర నాసిక్‌లోని కంబాట్ ఆర్మీ ఏవియేషన్ ట్రైనింగ్ స్కూల్‌లో కెప్టెన్ భరత్ భరద్వాజ్ శిక్షణ పూర్తి చేసుకున్నాడు. మంగళవారం గ్రాడ్యుయేషన్ డే సందర్భంగా కుటుంబసభ్యులు, స్నేహితురాలు హాజరయ్యారు. ఈ సందర్భంగా, కెప్టెన్ భరత్ తన ఐదేళ్ల ప్రేమను వ్యక్తపరచడానికి ఆర్మీ హెలికాప్టర్ ముందు మోకాళ్లపై కూర్చుని తన స్నేహితురాలికి రింగ్ తొడిగి ప్రేమను తెలియజేశాడు. ఆమె కూడా అతని ప్రేమను అంగీకరించడంతో అక్కడి వారంతా చప్పట్లతో శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో SMలో వైరల్‌గా మారింది.