బీఆర్ఎస్ పార్టీ హైకమాండ్ జారీ చేసిన షోకాజ్ నోటీసులకు పైలెట్ రోహిత్ రెడ్డి ఇప్పటికీ స్పందించలేదు. మార్చి 17న జారీ చేసిన నోటీసులకు 7 రోజుల్లో లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని ఆదేశించినప్పటికీ, 10 రోజులు గడిచినా ఆయన నుంచి పార్టీకి ఎటువంటి స్పందన రాలేదు. ప్రస్తుతం చంచల గూడ జైలులో రిమాండ్ లో ఉన్నందున వివరణ ఇవ్వలేకపోయారన్న వాదనలు వినిపిస్తున్నాయి. అయితే, రోహిత్ రెడ్డి తీరుపై కొందరు బీఆర్ఎస్ నేతల్లో అసహనం వ్యక్తమవుతోంది. కొందరు నేతలు ఆయనపై వేటు వేయాలని పార్టీ హైకమాండ్ కు సూచించినట్లు సమాచారం.