నెల రోజుల క్రితం తండ్రి అయిన పైలట్.. విమాన ప్రమాదంలో మృతి

రాజస్థాన్‌లోని చురూ జిల్లాలో బుధవారం జాగ్వార్‌ శిక్షణ విమానం కుప్పకూలి ఇద్దరు పైలట్లు మరణించిన సంగతి తెలిసిందే. వారిలో స్క్వాడ్రన్ లీడర్ లోకేందర్ సింగ్‌(31) నెలరోజుల క్రితమే తండ్రయ్యారు. జూన్ 10న ఆయన భార్య ఒక మగబిడ్డకు జన్మనిచ్చారు. పుట్టింట్లోనే ఉన్న ఆమె భర్త మరణవార్త విని తట్టుకోలేకపోయింది. హరియాణాలోని రోహతక్‌కు చెందిన లోకేందర్‌ సింగ్‌ 2016లో వాయుసేనలో చేరారు. కొవిడ్ సమయంలో ఆయనకు వివాహం జరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్