విమాన ప్రమాదాన్ని చివరిక్షణంలో గుర్తించిన పైలట్లు.. కాక్‌పిట్‌లో మాటలు రికార్డ్

మహారాష్ట్ర బారామతిలో జరిగిన ఘోర విమాన ప్రమాదంపై దర్యాప్తు కొనసాగుతోంది. ప్రమాదాన్ని చివరి క్షణాల్లో పైలట్లు గుర్తించినట్టు బ్లాక్‌బాక్స్‌ విశ్లేషణలో వెల్లడైంది. ప్రమాదాన్ని గమనించిన వెంటనే కాక్‌పిట్‌లో పైలట్‌ ‘ఓహ్‌ షి**’ అంటూ పలికిన మాటలు రికార్డయ్యాయని డీజీసీఏ అధికారులు తెలిపారు. అయితే అప్పటికే పరిస్థితి అదుపు తప్పడంతో విమానంలో ఉన్నవారంతా మృతి చెందినట్టు పేర్కొన్నారు. ఈ ఘటనపై విమాన ప్రమాద దర్యాప్తు బ్యూరో (ఏఏఐబీ) విచారణ చేపట్టింది.

సంబంధిత పోస్ట్