సమోసాలో పిన్నులు.. ప్రశ్నిస్తే తిరిగి తిట్టిన యజమాని!

TG: నాగర్‌కర్నూలు జిల్లా బిజినేపల్లి మండల కేంద్రంలోని ఓ స్వీట్ హౌస్‌లో సమోసాలో పిన్నులు కనిపించాయి. గురువారం ఓ వ్యక్తి షాపులో కొనుగోలు చేసిన సమోసాను తింటుండగా పిన్‌ గొంతులో గుచ్చుకోవడంతో బయటకు వచ్చి కక్కగా.. పిన్ బయటపడింది. ఈ విషయమై షాప్‌ యజమానిని ప్రశ్నించగా నిర్లక్ష్యంగా స్పందించాడని, తింటే తిను లేకపోతే లేదు అని తిట్టాడని బాధితుడు ఆరోపించాడు. ఫుడ్‌ సేఫ్టీ అధికారుల పర్యవేక్షణ లోపంతోనే ఇలాంటి అక్రమాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్