PKL 2025: ఫైనల్‌కు చేరుకున్న దబాంగ్ ఢిల్లీ(వీడియో)

PKL 2025లో దబాంగ్ ఢిల్లీ ఫైనల్ చేరుకుంది. సోమవారం ఉత్కంఠగా సాగిన టై బ్రేకర్‌లో పుణెరి పల్టాన్‌పై దబాంగ్ ఢిల్లీ గెలిచింది. ఇరు జట్లు 34-34 చొప్పున స్కోర్ చేయడంతో టై బ్రేకర్‌కు దారి తీసింది. ఢిల్లీ జట్టులో రైడర్లు నీరజ్ నర్వాల్ 7, అషూ మాలిక్ 4, డిఫెండర్లు సందీప్ దేశ్వాల్, సౌరభ్ నందాల్ చెరో 3 పాయింట్లు చొప్పున సాధించారు. మరో వైపు మంగళవారం జరిగే ఎలిమినేటర్ 3 మ్యాచ్‌లో పాట్నా పైరేట్స్‌తో తెలుగు టైటాన్స్ తలపడనుంది

సంబంధిత పోస్ట్