అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదం నేపథ్యంలో సోషల్ మీడియాలో కొన్ని ఫేక్ వీడియోలు వైరల్ అవుతున్నాయి. అహ్మదాబాద్ ఫ్లైట్‌లో ఓ ప్రయాణికుడు తీసినదని చెబుతూ ఒక వీడియోను షేర్ చేస్తున్నారు. అయితే PIB ఫ్యాక్ట్ చెక్ దాన్ని పరిశీలించగా, అది 2023 జనవరిలో నేపాల్‌లో జరిగిన విమాన ప్రమాదానికి చెందినదిగా నిర్ధారించారు. ప్రజలు నమ్మదగిన సోర్సులపై మాత్రమే ఆధారపడాలని, ఫేక్ వీడియోలను పంచుకోవద్దని PIB సూచించింది.