విమాన ప్రమాదం.. ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి

అహ్మదాబాద్ విమాన ప్రమాదం చాలామంది కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందారు. వీరిలో ముగ్గురు పిల్లలు, భార్య భర్త మృతి చెందారు. భర్త లండన్‌లో ఉద్యోగం చేస్తుండగా.. భార్య రాజస్థాన్‌లోని బన్స్వారాలో డాక్టర్‌గా పనిచేస్తోంది. అయితే ఉద్యోగం వదిలి తన ముగ్గురు పిల్లలను తీసుకుని భర్తతో లండన్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. దీంతో వారి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.

సంబంధిత పోస్ట్