విమాన ప్రమాదంలో గురువారం 24 మంది బీజే మెడికల్ కాలేజ్ మెడికోలు మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా మరో 4 నలుగురు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. మృతులు రాకేశ్, ఆర్యన్, మనవ్, జయ్‌ప్రకాష్‌గా తెలిపారు. దీంతో మృతుల సంఖ్య 28కు చేరింది. అయితే మరో మెడికో స్టూడెంట్ ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. ప్రస్తుతం భద్రతా బలగాలు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.