కెనడాలో మంగళవారం జరిగిన విమాన ప్రమాదంలో ఇద్దరు యువ పైలట్లు మృతిచెందారు. మృతుల్లో కేరళకు చెందిన 21 ఏళ్ల విద్యార్థి పైలట్ శ్రీహరి సుకేష్, కెనడియన్ పౌరుడు సవన్నామే రోయెస్ (20) ఉన్నారు. దక్షిణ మానిటోబాలోని స్టెయిన్‌బాచ్ ఎయిర్‌పోర్ట్ సమీపంలో హార్వ్స్ ఎయిర్ పైలట్ స్కూల్‌కు చెందిన విమానాలు ల్యాండింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా ప్రమాదం సంభవించింది. ఇద్దరూ ఒకేసారి ల్యాండ్ చేయడానికి ప్రయత్నించగా, విమానాలు ఒకదానికొకటి ఢీకొని వారు మృతిచెందారు.