కోలంబో నుంచి సిడ్నీ వెళ్తున్న శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్ విమానం (UL606) గాల్లో ఉండగా పిడుగుపాటుకు గురైంది. దీంతో ఒక ఇంజిన్ దెబ్బతిని మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన పైలట్లు విమానాన్ని యూటర్న్ తీసుకుని తిరిగి కోలంబోలో సురక్షితంగా ల్యాండ్ చేశారు. ప్రమాద సమయంలో విమానంలో 207 మంది ప్రయాణికులు, 16 మంది సిబ్బంది ఉన్నారు. పైలట్ల సమయస్ఫూర్తితో పెను ప్రమాదం తప్పడంతో ప్రయాణికులందరూ ఊపిరి పీల్చుకున్నారు.