నేపాల్‌లోని డోల్పా ఎయిర్‌పోర్టులో విమానం ల్యాండింగ్ సమయంలో వెనుక టైరు ఊడిపోయింది. సీతా ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం గురువారం ల్యాండ్ అవుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో విమానంలో 16 మంది ప్రయాణికులు ఉన్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.