తిరుమలలో తెల్లవారుజామున దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో ఆహ్లాదకర వాతావరణం నెలకొంది. శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయ పరిసరాలు, ఘాట్ రోడ్లు పొగతో నిండిపోయాయి. ఈ ప్రకృతి సౌందర్యాన్ని భక్తులు తమ ఫోన్లలో చిత్రీకరిస్తున్నారు. అధిక చలి కారణంగా వృద్ధులు, చిన్న పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది, సర్వదర్శనానికి 4 గంటల సమయం పడుతోంది.