పీఎం కిసాన్.. వీరికి మాత్రం డబ్బులు జమ కావు!

దేశవ్యాప్తంగా 9 కోట్ల రైతుల ఖాతాల్లో పీఎం కిసాన్ 21వ విడత డబ్బులు నవంబర్ 19న విడుదల కానున్నాయి. ఈ స్కీమ్‌కి అర్హత ఉన్నా eKYC పూర్తి చేయని, బ్యాంకు ఖాతాకు ఆధార్ లింక్ చేయని రైతులకు ఈ విడత నిలిచిపోయే అవకాశం ఉంది. ఈ స్కీమ్ లబ్ధిదారులు www.pmkisan.gov.in వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి. తర్వాత హోమ్‌పేజీలో కనిపించే 'Farmer's Corner' సెక్షన్‌లో 'Know your status' ట్యాబ్‌పై క్లిక్ చేసి, ఆధార్ నంబర్ ఎంటర్ చేసి మీ స్టేటస్ తెలుసుకోవచ్చు.

సంబంధిత పోస్ట్