నవంబర్ రెండో వారంలో.. ఖాతాల్లోకి పీఎం కిసాన్ నిధులు

ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద రైతులకు కేంద్ర ప్రభుత్వం ఏడాదికి రూ.6000 ఆర్థిక సహాయం అందిస్తోంది. ఈ నిధులను మూడు విడతల్లో రూ.2 వేల చొప్పున రైతుల ఖాతాలో జమ చేస్తోంది. ఇప్పటికే 20వ వాయిదా డబ్బులు అకౌంట్లలో జమ కాగా.. ఇప్పుడు 21వ విడత కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. నివేదికల ప్రకారం.. నవంబర్ రెండో వారంలో, బిహార్‌లో పోలింగ్ తర్వాత కేంద్రం ఈ మొత్తాన్ని విడుదల చేయవచ్చని తెలుస్తోంది. ఈ నిధులు ఖాతాల్లో జమ కావాలంటే రైతులు e-kYC చేయించుకోవడం తప్పనిసరి.

సంబంధిత పోస్ట్