ఈ నెల చివరి వారంలో రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ నిధులు

కేంద్ర ప్రభుత్వం 'పీఎం కిసాన్' పథకం కింద ఏడాదికి రూ.6000 (మూడు విడతల్లో రూ.2 వేల చొప్పున) అందిస్తోంది. ఇప్పటి వరకు రైతులు ఈ పథకం కింద 21 విడతలలో డబ్బులు అందుకున్నారు. ప్రస్తుతం 22వ విడత కోసం ఎదురు చూస్తున్నారు. తాజాగా దీనిపై ఓ అప్డేట్ అందుతోంది. అయితే కేంద్ర బడ్జెట్ వల్ల పీఎం కిసాన్ నిధుల విడుదల ఆలస్యమవ్వగా.. ఇప్పుడు ఆ పని పూర్తవ్వడంతో ఫిబ్రవరి చివరి వారంలో నిధులను విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైనట్లు ప్రభుత్వ వర్గాల ద్వారా తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్