PM-KMY: రైతుల ఖాతాల్లోకి ప్రతి నెలా రూ.3,000

చిన్న, సన్నకారు రైతులకు ఆర్థిక భద్రత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్‌ మాన్‌ధన్ యోజన(PM-KMY) అమలు చేస్తోంది. 18-40 ఏళ్ల మధ్య వయసు, 2 హెక్టార్ల లోపు సాగు చేసుకునే భూమి కలిగి ఉన్న రైతులు ఈ పథకంలో చేరవచ్చు. నెలకు రూ.55-రూ.220 చెల్లిస్తే కేంద్రం అంతే మొత్తం జమ చేస్తుంది. 60ఏళ్లు నిండాక ప్రతి నెలా కనీసం రూ.3,000 పెన్షన్ లభిస్తుంది. ఆధార్, బ్యాంక్ అకౌంట్, భూమి పాస్‌బుక్, ఫోన్ నంబర్‌తో కామన్ సర్వీస్ సెంటర్ లేదా https://maandhan.in/లో అప్లై చేసుకోవచ్చు.

సంబంధిత పోస్ట్

✕
✕