న్యూఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొన్న ప్రతినిధులతో భారత ప్రధాని మోదీ భేటీ అయ్యారు. 'హ్యుమానిటీ ఫస్ట్' థీమ్‌తో అంతర్జాతీయ సవాళ్లు, సుస్థిర అభివృద్ధిపై సభ్య దేశాల ప్రతినిధులు చర్చించారు. గ్లోబల్ గవర్నెన్స్ సంస్కరణలు, బహుపాక్షిక సహకారం పెంపొందించడమే లక్ష్యంగా ఈ రెండ్రోజుల సదస్సు సాగుతోంది. ఈ సమావేశంలో పలు కీలక అంతర్జాతీయ అంశాలపై చర్చలు జరిగాయి.