వచ్చే నెలలో యూఏఈలో పర్యటించనున్న పీఎం మోదీ!

ప్రధాని నరేంద్ర మోదీ మే నెలలో యూరప్ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ పర్యటనలో భాగంగా మార్గమధ్యంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లో ఆగి, ఆ దేశాధ్యక్షుడితో చర్చలు జరిపే అవకాశం ఉంది. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రపంచ ఇంధన సరఫరా సమస్యలు ఎదుర్కొంటున్న తరుణంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇంధన సరఫరా, ప్రాంతీయ భద్రత, పెట్టుబడులు, ఆహార ఉత్పత్తుల రవాణా కారిడార్లు, డిజిటల్ చెల్లింపుల సహకారం, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం వంటి అంశాలపై చర్చలు జరిగే అవకాశం ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్