అదానీపై వచ్చిన అభియోగాలను ప్రధాని లెక్క చేయడం లేదు: రాహుల్‌

దేశ ప్రజల కంటే అదానీనే ప్రత్యేకం అనేలా ప్రధాని నరేంద్ర మోదీ తీరు ఉందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. వయనాడ్‌లో ఏర్పాటు చేసిన సభలో శనివారం రాహుల్ గాంధీ పాల్గొని కీలక వ్యాఖ్యలు చేశారు. "అదానీ ఓ క్రిమినల్‌ అని అమెరికా ఆరోపణలు చేస్తున్నా భారత్‌ అతడి గురించి పట్టించుకోవడం లేదు. మీడియా, సీబీఐ, ఈడీ, ఆదాయపన్ను శాఖలను తమ ఆధీనంలో ఉంచుకున్నారు.. అవేవీ మా వద్ద లేవు." అని రాహుల్ పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్