PM Surya Ghar Yojana: పేదలందరికీ ఉచిత విద్యుత్

కేంద్ర ప్రభుత్వం సామాన్యులకు ఉచిత విద్యుత్ అందించే లక్ష్యంతో 'పీఎం సూర్య ఘర్ మఫ్త్ బిజిలీ యోజన' పథకాన్ని ఫిబ్రవరి 15, 2024 నుంచి అమలులోకి తెచ్చింది. ఈ పథకం ద్వారా ఇంటిపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకునే వారికి రూ.78 వేల వరకు ఆర్థిక సహాయం లభిస్తుంది. లబ్ధిదారులు నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పొందవచ్చు, అదనపు విద్యుత్‌ను డిస్కంలకు విక్రయించి ఆదాయం కూడా సంపాదించవచ్చు. 1 నుంచి 7 కిలోవాట్ల సోలార్ ప్లాంట్‌కు రూ.30 వేల నుంచి రూ.78 వేల వరకు సబ్సిడీ వర్తిస్తుంది. భారత పౌరులు, సొంత ఇల్లు, విద్యుత్ కనెక్షన్ ఉన్నవారు pmsuryaghar.gov.in లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

సంబంధిత పోస్ట్