భారతదేశంలో మహిళల కోసం అనేక పథకాలు అమలు అవుతున్నాయి. అందులో ప్రధాని మాతృ వందన యోజన ఒకటి. ఈ పథకం ద్వారా గర్భిణీలకు ప్రభుత్వం రూ.11,000 ఆర్థిక సహాయం అందిస్తుంది. ఈ సాయం నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు జమ అవుతుంది. ముఖ్యంగా, ఆర్థికంగా వెనకబడిన కుటుంబాలకు చెందిన మహిళలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు. ఈ పథకాన్ని మహిళా, శిశు అభివృద్ధి శాఖ నిర్వహిస్తోంది.