బిహార్లోని జముయిలో టెన్త్ క్లాస్ విద్యార్థిని లైంగిక వేధింపులకు గురైన ఘటనపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. బాలికను అవమానించేలా వ్యవహరించిన ఘటనపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఏడీజీ (లా అండ్ ఆర్డర్) కేఎస్ అనుపమ్ తెలిపారు. ఈ కేసులో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. కాగా కోచింగ్ అనంతరం స్నేహితుడితో కలిసి ఇంటికి వెళ్తుండగా కొందరు దుండగులు ఆమెను అడ్డగించి, లైంగికంగా వేధించారు.