బిహార్‌లోని పాట్నాలో ట్రాఫిక్ పోలీసుల దురుసు ప్రవర్తనపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఒక యువకుడిని ఆపి, హెల్మెట్ తీయమని హెచ్చరిస్తూ ఒక అధికారి అతడిపై చేయి చేసుకున్నాడు. ఈ ఘటనను రికార్డ్ చేస్తున్న మరో వ్యక్తిపై కూడా పోలీసులు రెచ్చిపోయారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవ్వడంతో, పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. బాధితుడి స్నేహితుడు ఈ వీడియోను పోస్ట్ చేసి, 24 గంటల్లోగా చర్యలు తీసుకోకపోతే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించాడు.