కవితను అదుపులోకి తీసుకున్న పోలీసులు (వీడియో)

TG: హైదరాబాద్ నార్సింగిలోని ఓ వెంచర్‌ వద్ద స్థానికులతో కలిసి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ధర్నాలో పాల్గొన్నారు. మూసి నది పక్కన నిర్మిస్తున్న వెంచర్‌పై కవిత ఆరోపణలు చేశారు. మధ్యాహ్నం నుంచి అక్కడే బైఠాయించారు. హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ వచ్చే వరకు కదిలేది లేదని స్పష్టం చేశారు. దీంతో ధర్నాను పోలీసులు అడ్డుకుని ఆమెను అదుపులోకి తీసుకున్నారు. కవితతో పాటు పలువురు జాగృతి నాయకులను అరెస్ట్ చేశారు.

సంబంధిత పోస్ట్