AP: ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో పోలీసులు రెచ్చిపోయారు. రాత్రి 10.30 దాటినా షాపు మూయలేదని పోలీసులు పలువురిని చితకబాదారు. షాపు మూసేస్తున్నామని చెప్పినా లాఠీలతో కొట్టారు. ఈ ఘటన కొండపల్లి మున్సిపాలిటీలో చోటు చేసుకుంది. పోలీసులు లాఠీలతో కొట్టడంపై షాపు యాజమాన్యాలు శుక్రవారం పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన చేపట్టేందుకు సిద్ధమవుతున్నాయి. పోలీసులకు కొట్టే హక్కు ఎవరిచ్చారని షాప్ యాజమాన్యాలు మండిపడ్డాయి.