TG: భద్రాద్రి జిల్లా జూలూరుపాడులో బీఎస్సీ నర్సింగ్ విద్యార్థిని హరిణి హత్య కేసును పోలీసులు చేధించారు. అదే గ్రామానికి చెందిన దేవరకొండ పవన్‌కుమార్ అనే వ్యక్తి హత్య చేసినట్లుగా నిర్ధారించారు. సదరు విద్యార్థిని పెళ్లికి నిరాకరించిందని పవన్‌కుమార్ వైరుతో ఆమె గొంతు నులిమి హత్య చేశాడు. నిందితుడు పవన్‌కుమార్‌ను పోలీసులు అరెస్టు చేశారు. సెప్టెంబరు 22న హరిణి అనుమానాస్పద స్థితిలో మృతిచెందడంతో బాధిత కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.