పారిపోతున్న నిందితుడిపై పోలీసుల కాల్పులు (వీడియో)

పశ్చిమ బెంగాల్‌లోని అసన్‌సోల్ పోలీసులు ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించి ఓ నేరస్థుడిని అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న నిందితుడు ప్రతాప్ దాస్‌ను పట్టుకునే సమయంలో పోలీసులపై కాల్పులకు దిగడంతో పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో అతడి కుడి కాలికి బుల్లెట్ తగిలినట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. నిందితుడి వద్ద ఉన్న తుపాకీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బుల్లెట్ గాయాలతో అతడిని ఆసుపత్రికి తరలించారు. సైబర్ క్రైమ్ కేసులో ప్రతాప్ దాస్‌ను పట్టుకునేందుకు కొన్ని రోజుల క్రితం పోలీసులు వెళ్లగా, వారిపై కాల్పులు జరిపి తప్పించుకున్నాడు.

సంబంధిత పోస్ట్

✕
✕