సీఎం భార్యపై వ్యాఖ్యలు.. పవన్ ఖేరా కోసం పోలీసుల వేట

అస్సాం CM హిమంత బిశ్వ శర్మ భార్య రిణికి భుయాన్‍పై కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ ఖేరా చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. రిణికి భుయాన్‍కు మూడు పాస్ పోర్టులు ఉన్నాయని పవన్ ఖేరా ఆరోపించారు. ఈ నేపథ్యంలో, పవన్ ఖేరాపై అస్సాం పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మంగళవారం ఢిల్లీలోని ఆయన నివాసంలో పోలీసులు తనిఖీలు చేపట్టి కీలక పత్రాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు స్వాధీనం చేసుకున్నారు.

సంబంధిత పోస్ట్