డీఎస్పీగా ప్రమోషన్‌.. ఇంతలోనే పోలీస్‌ అధికారి ఆత్మహత్య!

కర్ణాటకలోని బెళగావి సిటీలో బుధవారం రాత్రి పోలీసు శాఖలోని ఎస్‌డీఆర్‌ఎఫ్‌లో ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న శ్రీశైల్‌ చౌగలే (37) ఆత్మహత్య చేసుకున్నారు. విధులు ముగించుకుని ఇంటికి వెళ్లి ఉరి వేసుకున్న ఆయన మృతదేహాన్ని కుటుంబ సభ్యులు, పోలీసులు గుర్తించారు. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చౌగలే ప్రతిభావంతుడైన అధికారి అని, త్వరలో డీఎస్పీగా పదోన్నతి పొందాల్సి ఉందని బంధువులు తెలిపారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

సంబంధిత పోస్ట్