TG: ఈ-కామర్స్ వెబ్‌సైట్ల ద్వారా స్టెరాయిడ్ ఇంజెక్షన్లు కొనుగోలు చేసి, హైదరాబాద్ నగరంలో అధిక ధరలకు విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వైద్యుల అనుమతి లేకుండా వీటిని వాడటం ప్రమాదకరమని, కొందరు నకిలీ మందుల చీటీలతో కొనుగోలు చేస్తున్నారని టాస్క్‌ఫోర్స్ డీసీపీ వైభవ్ గైక్వాడ్ తెలిపారు. ఇండియా మార్ట్‌కు స్టెరాయిడ్ ఇంజెక్షన్లు అమ్మకూడదని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన పేర్కొన్నారు.