ఢిల్లీలో సీజేపీ ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ మేరకు పలు డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ సోమవారం CJP కార్యకర్తలు పార్లమెంట్ ముట్టడికి యత్నించారు. ఈ క్రమంలో పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. అయితే కొందరు పోలీసులు నిరసనకారులపై రాళ్లు రువ్విన వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఇలాంటి ఘటనలను అదుపు చేయాల్సిన పోలీసులే ఇలా రాళ్లు విసరడం ఏంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.