TG: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి వన్‌టౌన్ పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆన్ డ్యూటీలో ఉండాల్సిన పోలీసులు, విధులకు గైర్హాజరై ఫామ్‌హౌస్‌లో జరిగిన బర్త్‌డే పార్టీలో పాల్గొని మద్యం మత్తులో చిందులు వేశారు. స్టేషన్ రికార్డుల్లో మాత్రం విధుల్లో ఉన్నట్లుగా నమోదు చేసి, నిబంధనలను తుంగలో తొక్కిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బాధ్యతాయుతమైన పోలీసులు ఇలా వ్యవహరించడం పట్ల స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.