డివైడర్‌ను ఢీకొన్న కారు.. డ్రైవర్‌ను కాపాడిన పోలీసులు (VIDEO)

నోయిడా సెక్టార్ 35లోని యూ-టర్న్ వద్ద శుక్రవారం రాత్రి వేగంగా వచ్చిన కారు డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఇరుక్కుపోయిన డ్రైవర్‌ను డయల్ 112 సిబ్బంది ఎస్‌ఐ భరత్ సింగ్, హెడ్ కానిస్టేబుల్ సురేంద్ర కుమార్, కానిస్టేబుల్ రాజు కలిసి క్షేమంగా బయటకు తీశారు. గుర్గావ్‌కు చెందిన యశ్ కుమార్ అనే డ్రైవర్‌ను సకాలంలో ఆసుపత్రికి తరలించగా, అతని ప్రాణాపాయం తప్పింది. పోలీసుల సత్వర చర్యను నెటిజన్లు అభినందిస్తున్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕