మెదక్ జిల్లాలో కుటుంబ కలహాలతో మనస్తాపానికి గురైన సంతోష్ అనే వ్యక్తి శుక్రవారం ఆత్మహత్య చేసుకునేందుకు యత్నిస్తుండగా పోలీసులు ప్రాణాలు కాపాడారు. ఇంట్లో తలుపులు వేసుకుని చీరతో ఉరివేసుకుంటుండగా, డయల్ 112కు సమాచారం అందింది. వెంటనే కానిస్టేబుల్ రమేష్, హోంగార్డు మైసయ్య ఘటనా స్థలానికి చేరుకుని, తలుపులు పగులకొట్టి సంతోష్‌ను కిందకు దించారు. సకాలంలో స్పందించి వైద్య సహాయం అందించిన పోలీసుల చొరవపై స్థానికులు ప్రశంసలు కురిపిస్తున్నారు. పోలీసుల సమయస్ఫూర్తితో సంతోష్ ప్రాణాపాయం నుండి బయటపడ్డాడు.