శక్తి యాప్ ద్వారా అర్ధరాత్రి యువతిని కాపాడిన పోలీసులు

AP: విజయవాడలో ఒంటరిగా బస్టాండ్‌లో వేచి చూస్తున్న యువతిని ఆటో డ్రైవర్ ఫణీంద్ర అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడు. అయితే, యువతి శక్తి యాప్‌లో ఆటో వివరాలు నమోదు చేయడంతో పోలీసులు సకాలంలో స్పందించి ఆమెను రక్షించారు. మంగళగిరి రూరల్ పోలీసులు ఫణీంద్రను అదుపులోకి తీసుకున్నారు. మహిళల భద్రతకు శక్తి యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందని, ఒంటరిగా ప్రయాణించే మహిళలు ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని మంగళగిరి డీఎస్పీ మురళి కృష్ణ సూచించారు.

సంబంధిత పోస్ట్