ప్రశ్న రావణ్ ఇంటిని తనిఖీ చేసిన పోలీసులు

AP: వివాదాస్పద వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రశ్న రావణ్ ఇంటిని పోలీసులు తనిఖీలు చేశారు. సంగారెడ్డి జిల్లా అమీన్‌పుర్ పట్టణం నరేంద్రనగర్ కాలనీలోని డీ-బ్లాక్ 128 ఫ్లాట్‌లో గత రెండేళ్లుగా రావణ్ ఉంటున్నట్లు తెలిసింది. బుధవారం సాయంత్రం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు జరిగిన తనిఖీల్లో 8 మందితో కూడిన గన్నవరం పోలీసుల బృందం పాల్గొంది. కొన్ని దస్త్రాలు, రికార్డులు స్వాధీనం చేసుకున్నారు.

సంబంధిత పోస్ట్