మానవత్వం చాటుకున్న పోలీసులు.. గర్భిణీ స్త్రీని ఆస్పత్రికి తరలింపు

TG: హైదరాబాద్ షాలిబండలో గణేశ్ నిమజ్జనం సందర్భంగా క్యాబ్ దొరక్క ఇబ్బంది పడిన ఓ గర్భిణీ మహిళకు హుస్సేని ఆలం పోలీసులు మానవత్వం చాటుకున్నారు. వెంటనే స్పందించి, పోలీసు వాహనంలో ఆమెను ఆస్పత్రికి తరలించారు. గర్భిణీకి తోడుగా మహిళా కానిస్టేబుల్‌ను కూడా పంపించారు. పోలీసుల సకాలంలో సహాయంతో ఆ మహిళ ఆసుపత్రికి చేరుకోగలిగింది. ఈ చొరవపై పోలీసులపై ప్రశంసలు వెల్లువెత్తాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕