TG: సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ నిర్వాహకురాలు, డాక్టర్ నమ్రతను చంచల్ గూడ జైలు నుంచి పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా నమ్రత తాను ఏ తప్పూ చేయలేదని మీడియాతో అన్నారు. తప్పుడు ఆరోపణలతో తనపై కేసు నమోదు చేశారన్నారు. త్వరలోనే అన్ని విషయాలు చెబుతానని తెలిపారు. కాగా నమ్రతను పోలీసులు కస్టడీలో ప్రశ్నించనున్నారు. కాగా సరోగసి పేరుతో రాజస్థాన్ దంపతులను డాక్టర్ నమ్రత మోసం చేసినట్లు గుర్తించారు.