బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ మంగళవారం తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీని పందికొక్కులు, రాబందులతో పోల్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భాషను మురికి భాషగా, బజారు భాషగా విమర్శించారు. కేసీఆర్ 3.0 పాలనలో పోలీసులకు శిక్షలు తప్పవని హెచ్చరించారు. ఈ సమావేశంలో కార్పొరేషన్ మాజీ చైర్మన్లు రామచంద్రనాయక్, పల్లె రవికుమార్, గాంధీ నాయక్, నేతలు బొమ్మెర రామమూర్తి, హరి రమాదేవి పాల్గొన్నారు.