దేశ రాజధాని ఢిల్లీలో మరో దారుణం చోటుచేసుకుంది. స్నేహితుడితో కలిసి బయటకు వెళ్లిన 17 ఏళ్ల బాలికపై ముగ్గురు వ్యక్తులు పోలీసులమని చెప్పి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఈ ఘటనపై ప్రజల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.