జూబ్లీహిల్స్‌లో పెరిగిన పొలిటికల్ హీట్.. నేటి నుంచి రోడ్ షోలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు రసవత్తరంగా మారాయి. బీఆర్ఎస్ తమ సిట్టింగ్ సీటును నిలబెట్టుకోవడానికి, కాంగ్రెస్, బీజేపీలు తమ జెండా పాతడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తరఫున సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం రోడ్ షో నిర్వహించనుండగా, బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత తరఫున కేటీఆర్ కూడా అదే రోజు నుంచి నియోజకవర్గంలో రోడ్ షోలతో ప్రచారాన్ని ముమ్మరం చేయనున్నారు. ఈ ఎన్నికల ఫలితాలు పార్టీల ప్రతిష్టను తేల్చనున్నాయి.

సంబంధిత పోస్ట్