TG: సింగరేణి సంస్థలో రాజకీయ జోక్యం పెరిగిపోయిందని మాజీమంత్రి హరీశ్ రావు ఆరోపించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. కోల్ ఇండియా విధానాలనే సింగరేణిలో అమలు చేయాలని డిమాండ్ చేశారు. సింగరేణికి రావాల్సిన బొగ్గు గనులను జెన్‌కోకు ఇచ్చేలా కుట్ర జరుగుతోందని ఆరోపించారు. సింగరేణి సంస్థను ఆగం చేస్తున్నారని మండిపడ్డారు.