రేపే ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్

తెలుగు రాష్ట్రాల్లో మంగళవారం సాయంత్రం 4.30 గంటలకు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఏపీలో మూడు, తెలంగాణలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఈ నెల 3న నోటిఫికేషన్ విడుదలైంది. దాదాపు 25 రోజుల పాటు కొనసాగిన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో తమ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలు , ఉపాధ్యాయ సంఘాలు ప్రచారం కొనసాగించారు. 27 గురువారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఓట్ల లెక్కింపు మార్చి 3న జరుగనుంది.

సంబంధిత పోస్ట్