మీకు నేరేడు పండు చరిత్ర, ఉపయోగాలు తెలుసా?

నేరేడు పండును జంబూఫలం అని కూడా పిలుస్తారు. దీని వల్లే భారతదేశానికి జంబూద్వీపం అనే పేరు వచ్చిందని చెబుతారు. శుభకార్యాలలో సంకల్పం చెప్పేటప్పుడు 'జంబూద్వీపే భరతవర్షే భరతఖండే' అని ఇప్పటికీ ఉపయోగిస్తారు. భారత ఉపఖండంలో విస్తారంగా పండే ఈ పండు, వేసవి చివరి నుంచి వర్షాకాలం వరకు లభిస్తుంది. హిందీలో 'జామున్‌' అనే పేరు కూడా 'జంబూఫలం' నుంచే వచ్చింది. నేరేడు ఉత్పత్తి, ఎగుమతుల్లో భారతదేశం అగ్రస్థానంలో ఉంది. మధుమేహానికి విరుగుడుగా నేరేడును ఉపయోగిస్తారు. దీని రసం, గింజలతో మధుమేహాన్ని అదుపు చేసే ఔషధాలు తయారుచేస్తారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్