దానిమ్మలో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయని, ఇవి శరీరంలోని ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు. రక్తహీనతతో బాధపడుతున్న వారు వీటిని క్రమం తప్పకుండా తినడం వల్ల మంచి ఫలితం ఉంటుందని తెలిపారు. వీటిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుందని, ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుందని సూచిస్తున్నారు. వాపు, వృద్ధాప్యంతో పోరాడటానికి సహాయపడతాయని చెబుతున్నారు.