మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. మహిళలకు ఉచిత ప్రయాణాన్ని కేటీఆర్ జీర్ణించుకోలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. అక్కా, చెల్లెళ్లపై ఫేక్ వీడియోలతో కుట్లు, అల్లికలంటూ అవమానిస్తున్నారని అన్నారు. డ్యాన్సులు చేసుకోమని అవమానించిన కేటీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర మహిళా కమిషన్లలో కేసులు నమోదు చేయాలన్నారు.