పూజా గది వాస్తు.. ఈశాన్యంలోనే శుభం, దక్షిణ దిశ నిషేధం

హిందూ సంప్రదాయంలో పూజా గదిని సానుకూల శక్తికి కేంద్రంగా భావిస్తారు. వాస్తు ప్రకారం సరైన దిశలో, సరైన ప్రదేశంలో పూజా గది ఉంటే ఇంట్లో ఆనందం, శాంతి, శ్రేయస్సు పెరుగుతాయి. వంటగది, పడకగది, మెట్ల కింద, స్నానాల గది దగ్గర పూజా గదిని నిర్మించరాదని వాస్తు శాస్త్రం చెబుతుంది. పూజ గదికి అత్యంత శుభప్రదమైన దిశ ఈశాన్యం (ఉత్తర-తూర్పు మూల) కాగా, దక్షిణ దిశను నివారించాలి. పూజా మందిరాన్ని నేరుగా నేలపై కాకుండా, శుభ్రమైన చెక్క పీఠం లేదా ఎత్తైన స్థలంలో ఉంచాలి. చుట్టూ పరిశుభ్రత, ప్రశాంతత ఉండేలా చూసుకోవాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్