గాయం కారణంగా ఆర్సీబీకి దూరమైన పూజా వస్త్రాకర్‌

డబ్ల్యూపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు షాక్ తగిలింది. పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ పూజా వస్త్రాకర్ గాయానికి గురై దాదాపు రెండు వారాలు టోర్నీకి దూరం కానుంది. ఈ విషయాన్ని హెడ్‌కోచ్ రంగరాజన్ వెల్లడించారు. తొలుత భుజం గాయంతో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో చికిత్స పొందిన పూజా, తాజాగా తొడ కండరాల గాయానికి గురైంది. ఆమె గైర్హాజరీలో లిన్సే స్మిత్‌, అరుధంతి రెడ్డి, నదైన్ డి క్లర్క్ బౌలింగ్ భారం మోస్తున్నారు. కాగా, ముంబయితో తొలి మ్యాచ్‌లో ఆర్సీబీ మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్